తన గాత్రంతో అందరిని ముగ్దుల్ని చేస్తారు, ఆయన పాటలు పాడితే ఎవరైనా అలా ఉండిపోవాల్సిందే.. సౌత్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఆయన పాటలకు అంత పేరు ఉంది, మనకు తమిళ కేరళ సినిమా పరిశ్రమలో గానగంధర్వుడిగా ఆయనని పిలుస్తారు, ఆయనే ప్రముఖ గాయకుడు కే ఏసుదాసు.
తాజాగా కేజే ఏసుదాసు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు కేజే జస్టిన్ కొచ్చిలో శవమై తేలాడు. కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ దగ్గర జస్టిన్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక్కడ ఆయన
మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. దీంతో ఆయన కుటుంబానికి ఈ విషయం తెలిపారు, పెద్ద ఎత్తున స్దానికులు అక్కడకు చేరుకున్నారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది అనుమానాస్పద మృతి గా పోలీసులు చూస్తున్నారు, అయితే కుటుంబ సభ్యులు చెప్పేదాని ప్రకారం ఆయన చర్చికి వెళ్లి వస్తాను అన్నారు కాని తిరిగి రాలేదు అని తెలుస్తోంది, ఇక ఏసుదాసులాగా ఆయన కూడా సింగర్, రచయితగా కూడా పలు కథలు రాశారు, కొద్ది రోజుల క్రితం ఆయన కుమారుడు మరణించాడు ఆబాధలో ఆయన ఉన్నారట, అందుకే ఆత్మహత్య చేసుకున్నారా అని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.