కాజల్ ది ఎంత మంచి మనసో – ఎంత పెద్ద సాయం చేసిందంటే

కాజల్ ది ఎంత మంచి మనసో - ఎంత పెద్ద సాయం చేసిందంటే

0
85

కరోనా వైరస్ చాలా మందికి ఉపాధిని కూడా దూరం చేసింది అని చెప్పాలి, ఇప్పటికే ఈ వైరస్ దాటికి చాలా మంది భయపడిపోతున్నారు …రోజు వారి పనులు చేసుకుని ఆ ఆదాయంతో బతికే వారు పనులు లేక పస్తులు ఉంటున్నారు, చాలా వరకూ రోడ్ సైడ్ ఫుడ్ తినేవారు కూడా తగ్గిపోయారు, దీంతో చిన్న వ్యాపారులు పనులు లేక ఆదాయం లేక పస్తులు ఉంటున్నారు.

ఈ వైరస్ కష్టాలతో ఓ క్యాబ్ డ్రైవర్ పడుతున్న ఇబ్బందిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పంచుకుంది..
రెండు రోజులుగా క్యాబ్ లో ఒక్క కస్టమర్ కూడా ఎక్కలేదట, ఈరోజు మీరు ఎక్కారు మీరు ఇచ్చిన డబ్బులతో ఇంటికి సరుకులు తీసుకువెళతా అని అతను బాధపడుతూ చెప్పాడట.

ఇలాంటి వారికి సాయం చేయండి, వారికి మనం చేసే చిన్న సాయం వల్ల కుటుంబం ఆనందంగా ఉంటారు అని చెప్పింది, అతనికి మరో 500 అదనంగా ఇచ్చిందట కాజల్ .. ఆమె చేసిన ఈ సాయం చూసి చాలా మంది ఎంత మంచి మనుసు మా కాజల్ కి అని అంటున్నారు.