కోలీవుడ్ కి పూజ పెద్ద హీరోతో సినిమా

కోలీవుడ్ కి పూజ పెద్ద హీరోతో సినిమా

0
103

టాలీవుడ్ లో వరుసగా సినమాలు చేస్తూ అన్నీ అగ్రహీరోలతో హిట్ లు సాధిస్తోంది హీరోయిన్ పూజా హెగ్డే..ఇక తెలుగులో అవకాశాలు ఉన్నాయి సరే ఇప్పుడు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయట, తాజాగా మాస్టర్ సినిమా చేస్తున్నారు విజయ్ , ఇక తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయింది అని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సూర్యతో సూరరైపోట్రు సినిమా రూపకల్పలో బిజీగా ఉన్న మహిళా దర్శకురాలు సుధ కొంగర చెప్పిన కథకు విజయ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన పూజా అయితే బాగుంటుంది అని భావించారు. అందుకే ఆమెతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట.

పూజా చివరిగా జీవాకి జోడీగాముగమూడి చిత్రంలో నటించింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడంతో పూజాకి మళ్లీ తమిళంలో అవకాశం రాలేదు. సో మరోసారి పూజ కోలీవుడ్ లో తన సినిమాతో ఎలాంటి అవకాశాలు రాబడుతుందో చూడాలి.