మల్టీస్టారర్ ఫిల్మ్ తో మనముందుకొస్తున్న కోలీవుడ్ స్టార్ హీరోలు..

0
109

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్‌ 29 వ తేదీన విడుదల కలెక్షన్ల సునామి సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించినవారందరికి మంచి క్రేజ్ కూడా దక్కింది.

దాంతో మల్టీస్టారర్ ఫిల్మ్స్ బాగా హిట్ అవుతాయని సినీ నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు అధికంగా వచ్చే అవకాశం ఉందని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నా విధంగానే హీరోలు అందరు మల్టీస్టారర్ ఫిల్మ్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ కుమార్, విజయ్ కాంబినేషన్ లో పిక్చర్ తీయాలనుందని స్టార్​ డైరెక్టర్​ వెంకట్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తాజాగా చెన్నైలోని ఓ కాలేజ్​ ఫంక్షన్‌లో వెంకట్ ప్రభు మాట్లాడుతూ..అజిత్ కుమార్, విజయ్ ఇద్దరు హీరోలకు సరిపోయే మంచి స్టోరి ఉందని తెలిపారు. మరి దీనిపై కోలీవుడ్ స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.