కొమురం భీమ్ అఫీషియల్ లుక్ విడుదల ఇది గ‌మ‌నించారా

కొమురం భీమ్ అఫీషియల్ లుక్ విడుదల ఇది గ‌మ‌నించారా

0
88

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ జరుగుతున్న దృశ్యాలు బ‌య‌టకు వ‌చ్చాయి దీంతో టీం వెంట‌నే అల‌ర్ట్ అయింది ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.. కోట్ల రూపాయ‌లు నిర్మాత‌లు పెట్టుబ‌డి పెట్టారు ఈ స‌మ‌యంలో పోస్ట‌ర్లు బ‌య‌ట‌కు రావ‌డం లుక్ రివీల్ కావ‌డం పై జ‌క్క‌న్న సీరియ‌స్ అయ్యారు.

అంతేకాదు వెంట‌నే అప్రమత్తమైన యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు, తాజాగా మ‌న్యంలో ఆయ‌నకు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంది

అయితే కొంద‌రు ఆయ‌న లుక్ ని రివీల్ చేస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. అంతేకాదు లుక్, వీడియోను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ అయింది. దీంతో వెంట‌నే చిత్ర‌యూనిట్ ఎన్టీఆర్ అఫీషియల్ లుక్ ను తాజాగా విడుద‌ల చేశారు. సిమిల‌ర్ గా ఉన్నా జ‌క్క‌న్న టీం వ‌దిలిన లుక్ బాగుంది అంటున్నారు తార‌క్ అభిమానులు.