Kona Venkat | ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా: కోన వెంకట్

-

రచయిత కోన వెంకట్(Kona Venkat) ‘అదుర్స్’ సీక్వెల్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కోన నిర్మాతగా వ్యవహరించిన ‘గీతాంజలి’కి సీక్వల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్ లాంచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ “అదుర్స్ సినిమాలో చారీగా ఎన్టీఆర్ చేసిన నటన ఇంకెవరు చేయలేరు. ఆ సినిమాకి సీక్వెల్ తీసుకురావాలని నాకు ఎప్పటినుంచో ఉంది. ఆ సీక్వెల్ కథ రాసుకున్న తరువాత.. ఎన్టీఆర్ ఇంటిముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేసి అయినా సీక్వెల్‌కి ఒప్పిస్తాను.వినాయక్‌తోనే సీక్వెల్ చేస్తా” అంటూ తెలిపారు.

- Advertisement -

కాగా ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన సాంబ, అదుర్స్, బాద్‌షా, జైలవకుశ సినిమాలకు కోన వెంకట్(Kona Venkat) పనిచేశారు. ఇందులో అదుర్స్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. కొంతకాలంగా ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం దేవరతో పాటు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలకు కమిట్ అయ్యాడు. దీంతో ‘అదుర్స్2’ ఎప్పుడు తెరకెక్కుతుందో వేచి చూడాలి.

Read Also: సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...