టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గేయ రచయిత కందికొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం ఉండటం సంగీత ప్రియులను ఆందోళనకు గురి చేస్తోంది.
15 సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడిన కందికొండ..ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, రచయిత కోన వెంకట్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కందికొండకు ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోన వెంకట్ కోరారు.
శ్రావణి ఇట్లు సుబ్రహ్మణ్యం సినిమాలోని “మళ్ళి కూయవే గువ్వా, ఇడియట్ లోని చూపుల్తో గుచ్చి గుచ్చి” లాంటి పాటలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.
https://twitter.com/konavenkat99