సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya) విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ కూడా ఒక మహిళ అయి ఉండి.. సాటి మహిళ సమంతను ఇంతలా ఎలా అవమానిస్తారని, తన స్వార్థ రాజకీయాల కోసం సాటి మహిళ కుటుంబ సమస్యలను బజారులో పెట్టడం ఎంత వరకు సబబు అంటూ నెటిజన్లు, అనేక మంది ప్రముఖులు కొండా సురేఖపై విమర్శలు గుప్పించారు. కాగా ఈ అంశంపై స్పందించిన ప్రముఖ దర్శకుడు ఆర్‌జీవీ(RGV) మాత్రం ఇందులో మరో కోణాన్ని టచ్ చేశారు. మంత్రి కొండా సురేఖ అసలు అవమానించింది సమంతను కాదని, అక్కినేని కుటుంబాన్ని అంటూ ఆర్‌జీవీ అన్నారు. అంతేకాకుండా కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
‘‘కొండా సురేఖ(Konda Surekha) సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని.. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు.. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది??? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో వుండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగ చైతన్య చాలా సీరియస్‌గా తీసుకుని మరచిపోలేని గుణపాఠం నేర్పాలి.’’ అని ఆర్‌జీవీ(RGV) పేర్కొన్నారు.