“కొండపొలం” మూవీ రివ్యూ

Kondapolam Movie Review

0
91

బ్లాక్ బాస్టర్ మూవీ ‘ఉప్పెన‌’ త‌ర్వాత హీరో వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన చిత్రం ‘కొండపొలం’. నవలా చిత్రంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ సరసన అందాల భామ రకుల్ నటించగా..కోట శ్రీనివాస్, సాయిచంద్, హేమ, అంటోని, రవిప్రకాశ్ కీలకపాత్రల్లో నటించారు. నేడు థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

ర‌వీంద్ర‌నాథ్ (వైష్ణ‌వ్‌తేజ్‌) గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువ‌కుడు. ఉద్యోగం కోసం హైద‌రాబాద్ చేరుకుంటాడు. కానీ నాలుగేళ్లు ప్ర‌య‌త్నించినా ఉద్యోగం రాదు. ఆత్మ‌విశ్వాస లోప‌మే త‌న‌కి శాపంగా మారుతుంది. ఎంత‌కీ ఉద్యోగం రాక‌పోవ‌డంతో తిరిగి ఊరికి చేరుకుంటాడు. తన తండ్రితో పాటు గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ‌తాడు. అక్క‌డికి వెళ్లాక ఆ యువ‌కుడికి అడ‌వి ఏం నేర్పింది?  గొర్రెల్ని కొండ‌పొలానికి తీసుకెళ్లి వ‌చ్చాక అత‌నిలో వ‌చ్చిన మార్పులు ఏంటి? యూపీఎస్సీలో ఐ.ఎఫ్‌.ఎస్‌కి ఎంపికయ్యేంత ఆత్మ‌విశ్వాసాన్ని ఎలా సంపాదించాడ‌నేది మిగ‌తా క‌థ‌.

వైష్ణ‌వ్‌తేజ్ త‌న న‌ట‌న‌తో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. గొర్రెల కాప‌రుల కుటుంబానికి చెందిన యువ‌కుడిగా పాత్ర‌లో ఒదిగిపోయాడు. రాయ‌ల‌సీమ యాస ప‌లికిన విధానం కూడా మెప్పిస్తుంది. పులితో చేసే పోరాట ఘ‌ట్టాల్లోనూ, క‌థానాయిక‌తో క‌లిసి చేసిన స‌న్నివేశాల్లోనూ  ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఓబుల‌మ్మ‌గా ర‌కుల్ కూడా చాలా స‌హ‌జంగా న‌టించింది. సాయిచంద్‌, ర‌విప్ర‌కాశ్, కోట శ్రీనివాస‌రావు, మ‌హేశ్ పాత్ర‌లు కూడా హ‌త్తుకునేలా ఉంటాయి.

ప్లస్ పాయింట్స్: అడ‌వి నేప‌థ్యంలో సాగే క‌థ, వైష్ణవ్ తేజ్ నటన, మాటలు, కీరవాణి సంగీతం, జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం

మైనస్ పాయింట్స్: భావోద్వేగాలు అంతగా పండకపోవటం, విజువ‌ల్ ఎఫెక్ట్స్

ఓ న‌వ‌ల‌ని సినిమాగా మ‌లిచిన విష‌యంలో క్రిష్ ప్ర‌య‌త్నం మెచ్చుకోవచ్చు. కానీ క‌థ‌నం, పాత్ర‌ల మ‌ధ్య  భావోద్వేగాల ప‌రంగా ఆయ‌న మ‌రిన్ని క‌స‌ర‌త్తులు చేయాల్సింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

రేటింగ్: 2.75/5