కొరటాల సినిమా తర్వాత చిరు కొత్త సినిమా ఫిక్స్ దర్శకుడు ఎవరంటే

కొరటాల సినిమా తర్వాత చిరు కొత్త సినిమా ఫిక్స్ దర్శకుడు ఎవరంటే

0
99

ప్రస్తుతం కొరటాల శివ చిత్రంలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది, డిఫరెంట్ లుక్ లో చిరు కనిపించనున్నారు, అయితే ఈ సినిమా తర్వాత ఆయన లూసిఫర్ చిత్రంలో నటిస్తారు అనే వార్తలు వినిపించాయి.

అయితే కొరటాల సినిమా తర్వాత ముందు త్రివిక్రమ్ తో సినిమా చేయాలి అని అనుకున్నారు ..ఆగష్టు నుంచి ఆయన ఫ్రీ అవుతారు ..ఈ సమయంలో త్రివిక్రమ్ తో సినిమా ప్లాన్ చేశారు ..కాని త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా ఒకే చేసుకున్నారు.దీంతో చిరు గ్యాప్ తీసుకోకుండా సుకుమార్ తో సినిమా చేయనున్నారట.

ఈ విషయంపై చిరంజీవి – సుకుమార్ మధ్య కథా చర్చలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. సుకుమార్ – చరణ్ కాంబినేషన్లోని రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారే ఈ సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది…ఇక ప్రస్తుతం బన్నీతో సుకుమార్ సినిమా చేస్తున్నారు..ఈ సినిమా చేసిన తర్వాత చిరు సినిమా స్టార్ట్ అవనుంది అని తెలుస్తోంది.