కొరటాల సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తా – దర్శకుడు కీలక వ్యాఖ్యలు

కొరటాల సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తా - దర్శకుడు కీలక వ్యాఖ్యలు

0
168

అల వైకుంఠపురం సినిమాతో ఆల్ టైం హిట్ అందుకున్నాడు బన్నీ, ఈ సినిమా అనేక రికార్డులు తిరగరాసింది అని చెప్పాలి, అయితే ఇప్పుడు తాజాగా ఆయన సుకుమార్ తో పుష్ప అనే చిత్రం చేస్తున్నారు, ఈ సినిమా షూటింగ్ ప్రక్రియ కరోనా లాక్ డౌన్ సమయంలో నిలిచిపోయింది, త్వరలో సెట్స్ పై పెట్టనున్నారు.

అయితే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడని సమాచారం. ఇక తర్వాత బన్నీ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు అనేది తెలిసిందే ..వచ్చే ఏడాది వరకూ బన్నీ ఫుల్ బిజీ ఆయన చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి.

గతంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేసాడు బన్నీ. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కూడా ప్రకటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కాని ఈ సినిమా కథలో కాస్త మార్పులు చేర్పులు ఉన్నాయి అని అందుకే పక్కన పెట్టారు అని ఇప్పటి వరకూ అందరూ భావించారు.

ఈ సమయంలో దర్శకుడు వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాపై దర్శకుడు వేణు క్లారిటీ ఇచ్చారు, ఈ సినిమా ఆగలేదు బన్నీ నాతో టచ్ లో ఉన్నాడు అని చెప్పారు, కొరటాల చిత్రం అవ్వగానే అన్నీ సెట్ అయితే ఇది సెట్ పైకి వెళ్లనుంది అని చెప్పారు దర్శకుడు వేణు శ్రీరామ్, నిజంగా బన్నీకి ఈ టైటిల్ చాలా బాగా సెట్ అయింది అని అభిమానులు అందరూ భావించారు.