కొరటాలతో పెద్ద వర్క్ పూర్తి చేసిన మెగాస్టార్

కొరటాలతో పెద్ద వర్క్ పూర్తి చేసిన మెగాస్టార్

0
96

మెగాస్టార్ చిరంజీవి తన 152 వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే .. ఏడాది నుంచి ఈ చిత్ర పనుల మీదే ఉన్నారు శివ.. మొత్తానికి సైరా తర్వాత చిరంజీవి డేట్స్ ఇప్పటికి కుదిరాయి.. ఈ సినిమా వచ్చే ఏడాది అంటే జనవరి 3 నుంచి మొదటి షెడ్యూల్ చేయాలి అని ప్లాన్ వేశారట.

అయితే చిత్ర ప్రారంభానికి ముందు చిరంజీవి లుక్‌, ఫిజిక్ విష‌యంలో ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ‌ను క‌న‌ప‌రుస్తున్నారు. అందుక‌ని ముంబై నుండి ఓ స్పెష‌ల్ మేక‌ప్ టీమ్‌ను కొర‌టాల హైద‌రాబాద్ రప్పించి లుక్ టెస్ట్ చేయించార‌ట‌. జ‌న‌వ‌రి 3 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూట్ స్టార్ట్ కానుంది

అయితే సినిమాలో దేవాదాయ శాఖలో ఉద్యోగిగా కీలక మైన రహస్యాల గురించి సాగే చిత్రం అని తెలుస్తోంది, ఇందులో చిరు యంగ్ ఆఫీసర్ గా కనిపించనున్నారట, ఇక చిరు సరసన త్రిషని సెలక్ట్ చేశారు , ఇక జనవరి 3న వీరితో ఇంట్రడక్షన్ సాంగ్ తీయనున్నారట.. ఈ సినిమాను ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి బాణీలు మ‌ణిశ‌ర్మ అందిస్తున్నారు.