నేను చనిపోలేదు.. బతికే ఉన్నాను: కోట శ్రీనివాసరావు

kota srinivasa rao

Kota Srinivasa Rao |టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్లు గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అటు ఇటు పోయి ఈ వార్త కోట శ్రీనివాస రావు చెవిలో పడింది. దీంతో ఆవేదనతో స్పందించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ‘తెల్లవారితే ఉగాది పండుగ రోజున ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను.

ఎవరో సోషల్ మీడియాలో ‘కోట దుర్మరణం’ అని వేశారట. దీంతో ఉదయం నుంచి ఒకటే ఫోన్లు. ఇప్పటికి నేను కనీసం 50 ఫోన్‌లు మాట్లాడాను. వ్యాను వేసుకుని పదిమంది పోలీసులు ఇంటికి వచ్చారు. విషయం తెలిసి ప్రముఖులు, నటులు వస్తే సెక్యూరిటీ కావాలని వచ్చామని చెప్పారు. ఇటువంటి వార్తలు నమ్మొద్దని మనవి చేస్తున్నా.. డబ్బు సంపాదించడానికి జీవితంలో ఛండాలపు పనులు బోలెడు ఉన్నాయి. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు.. దయచేసి బతికుండగానే తనను చంపొద్దని మనవి’’ అని కోట(Kota Srinivasa Rao) పేర్కొన్నారు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్.. డీజీపీకి రాజాసింగ్ లేఖ

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here