కొత్త అవతారం ఎత్తిన రష్మిక…. పర్మినెంట్ కాదులేండి

కొత్త అవతారం ఎత్తిన రష్మిక.... పర్మినెంట్ కాదులేండి

0
133

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు కొత్త అవతారం ఎత్తిందా అంటే అవుననే అంటున్నారు కొందరు… టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు జర్నలిస్ట్ అవతారం ఎత్తుతోంది… అది కూడా ఒకే సారి ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టనుంది…

ఇక అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన అటు వ్యాపార వేత్తగానే కాకుండా ఇటు ఆరోగ్యానికి సంబంధించిన పలు వివరాలను తెలియజేసే యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే… ఈ యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలిపుతోంది…

ఈ యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ కు గతంలో అక్కినేని కోడలు సమంత కూడా గెస్ట్ ఎడిటర్ గా పని చేసింది… అందులో ఆమె పలు హెల్త్ టిప్స్ ను తెలిపింది… ఇప్పుడు ఉపాసన కోరిక మేరకు రష్మిక ఎడిటర్ గా వ్యవహరించనుంది… అయితే ఇది పర్మినెంట్ కాదులేండీ