కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్న నాగార్జున – టాలీవుడ్ టాక్

కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్న నాగార్జున - టాలీవుడ్ టాక్

0
78

ఓపక్క సినిమాలు చేస్తూ హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు హీరో నాగార్జున.. అంతేకాదు

సినిమాలతో పాటు ఇటు వ్యాపారంలో కూడా ఎంతో గుర్తింపు ఉంది నాగార్జునకి..

కొత్త కొత్త బిజినెస్ లు చేయటంలోనూ నాగ్ ముందుంటుంటారు…చిరంజీవి, అరవింద్, మ్యాట్రిక్ ప్రసాద్ తో కలసి మాటీవీ మొదలు పెట్టి అక్కడా సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ అనిపించుకున్నారు..

 

అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో కూడా చూసుకుంటున్నారు… పలు వ్యాపారాలు ఉన్నాయి నాగార్జునకి, అయితే తాజాగా ఆయన ఓ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి..

గత ఏడాది నాగ్ ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలి అని అనుకున్నారట…కాని కరోనా పరిస్దితుల వల్ల ఆగారు.

 

భవిష్యత్ అంతా డిజిటల్ రంగానిదే అని వినిపిస్తోంది. ఇక చాలా మంది ఓటీటీ వేదికలలో ఎక్కువగా ఉంటున్నారు, అందుకే త్వరలో నాగ్ ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి..

ఇక ఫిల్మ్ స్టూడియో ఉంది అలాగే అక్కినేని ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ ఉండనే ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చే కొత్తవారిచేత కూడా మూవీస్ చేయించి ఓటీటీలో విడుదల చేయాలి అని చూస్తున్నారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.