కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న గోవా బ్యూటీ

కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న గోవా బ్యూటీ

0
169

తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌లో కెరియ‌ర్ ను స్టార్ట్ చేసి త‌క్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఇలియానా. టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోల సినిమాల‌కు స‌ర‌స‌న న‌టించి చిత్ర‌పరిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ గోవా బ్యూటీ.

ఇక ఆ త‌ర్వాత టాలీవుడ్ బోర్ కొట్టిందో ఏమో మూటా ముళ్లు స‌ర్ధుకుని బాలీవుడ్ కు చెక్కుసింది. అయితే బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ‌కు మొద‌ట్లో వ‌రుస అవ‌కాశాలు వచ్చాయి. బ‌ర్ఫీ వంటి సూప‌ర్ హిట్ సినిమాలు ఇలియానా న‌టించి అక్క‌డ‌ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవలే ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గాయి…

దీంతో గోవా బ్యూటీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోందట… ఇక నుంచి యాంకర్ గా మారాలని చూస్తోందట… యాంకరింగ్ అంటే బుల్లితెరలో యాంకర్ కాదు స్పోర్ట్స్ ఛానల్ లో యంకర్ గా మారేందుకు సన్నాహలు చేస్తోంది… ఇప్పటికే స్పోర్ట్ ఛానల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది… యాజమాన్యం కూడా ఇల్లీ బెబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి…