కొత్త ఛానల్ కు ఎండీగా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి

కొత్త ఛానల్ కు ఎండీగా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి

0
81

నందమూరి కుటుంబంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణిత పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు, ఆమె కుటుంబంతో ఇద్దరు పిల్లలతో చాలా బిజీగా ఉన్నా, భార్యగా ఎన్టీఆర్ కు సినిమాల్లో ఎంతో సపోర్ట్
చేస్తున్నారు, ఇక తక్కువగానే సినిమా ఫంక్షన్లలో ఆమె కనిపిస్తూ ఉంటారు.

అయితే ఆమె యం.బి.ఎ చదివిన విషయం తెలిసిందే, తాజాగా ఆమె వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారట.. ఆమె తండ్రి నార్నే శ్రీనివాసరావు సోదరి నిర్వహిస్తున్న యువ చానెల్ కి లక్ష్మీ ప్రణతి యం.డి గా వ్యవహరించబోతోందట.

ఇది క్యాటరింగ్ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ అని తెలుస్తోంది, ఇప్పటికే క్రియేటీవ్ టీమ్ వర్క్ అంతా స్టార్ట్ అయిందని సమాచారం, అయితే గతంలోన ఆమె తండ్రి నార్నే శ్రీనివాసరావు స్టూడియో ఎన్ ఛానల్ నిర్వహించారు, గతంలో అనుభవం ఉండటంతో ఇప్పుడు ఆమె ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారట.