కొత్త సినిమా ఒకే చేసిన నాగార్జున డైరెక్టర్ ఎవరంటే

కొత్త సినిమా ఒకే చేసిన నాగార్జున డైరెక్టర్ ఎవరంటే

0
90

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున త‌న కొత్త సినిమాని ప‌ట్టాలెక్కించ‌నున్నాడట.. ఇక చివరగా తనకు గతంలో కలసి వచ్చి హిట్ అయిన మన్మధుడికి కొనసాగింపుగా కేవలం టైటిల్ మాత్రమే , మన్మధుడు 2 ని తీశారు. అయితే అది పెద్ద హిట్ కాలేదు. ముందు అనుకున్నట్లు నాగ్ బంగార్రాజు సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా మరో ఆరునెలలు వెనక్కి వెళ్లింది. అయితే నాగచైతన్య కూడా చేతిలో మూడు సినిమాలు ఉండటంతో మల్టీ స్టారర్ కు బ్రేక్ ఇచ్చాడు.

ఇక అఖిల్ తో ఓ సినిమా నిర్మించాలని అనుకుంటున్నాడట నాగార్జున .. ఈ సమయంలో తాను ఓ సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు.. నాగ్ తాజాగా ఓ కథ విన్నారట.. మాట్నీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కొత్త దర్శకుడు సొలమన్ తో సినిమాను చేయబోతున్నారు నాగార్జున…మహర్షి సినిమా స్క్రిప్ట్ లో ఈయన కూడా పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఆయన నాగార్జునకి ఓ కథ చెప్పారట. ఇది నాగార్జునకి నచ్చడంతో దీనికి ఒకే చేశారు అని తెలుస్తోంది. మరో 10 రోజుల్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. శని ఆదివారాలు సినిమాపై ప్రకటన వస్తుందట.