కొత్త సినిమా పై అనుష్క క్లారిటీ దర్శకుడు ఎవరంటే

కొత్త సినిమా పై అనుష్క క్లారిటీ దర్శకుడు ఎవరంటే

0
96

ఈ మధ్య టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క గురించి ఒకటే వార్త వినిపిస్తోంది.. ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతోంది అని.. వ్యాపార వేత్తతో పెళ్లి అని కొందరు అన్నారు.. తర్వా క్రికెటర్ తో పెళ్లి అని కొందరు అన్నారు.. ఇక ఓ దర్శకుడి కుమారుడితో వివాహం అని కొందరు అన్నారు… ఇలా పెళ్లి అంటూ తెగ వైరల్ చేశారు.. కాని తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

ఇవన్నీ ట్రాష్ వార్తలు అని చెప్పారు.. తాజాగా అనుష్క శెట్టి ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాను పూర్తి చేసి తదుపరి సినిమాకు సన్నద్ధమవుతోంది. అయితే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేసింది. ఆమె గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలియజేసింది. ఇది కాకుండా మరో రెండు సినిమాల కోసం చర్చలు జరుపుతుందట.

అనుష్క నటించిన నిశ్శబ్దం ఏప్రిల్ 2న విడుదలవుతుందని ప్రకటించారు. కాని కరోనా ఎఫెక్ట్ తో చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది….అయితే ఇంకా చర్చల్లో ఉన్న మరో రెండు సినిమాలు ఏమిటా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.