కొత్త సినిమా స్టార్ట్ చేయనున్న అనిల్ రావిపూడి హీరో ఎవరంటే

కొత్త సినిమా స్టార్ట్ చేయనున్న అనిల్ రావిపూడి హీరో ఎవరంటే

0
75

ఈ సంక్రాంతి ఆ డైరెక్టర్ కు మంచి విజయం ఇచ్చింది.. సంవత్సరం ఆరంభం మంచి బోణి కొట్టించింది.. అందుకే సరిలేరు నీకెవ్వరు చిత్ర టీం అంతా ఇక సక్సెస్ మూడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు,

ఇక తన కథలో మార్క్ కామెడీ సీరియస్ నెస్ తో మరో కథ ని సెట్ చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి… ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో .. ఏ బ్యానర్లో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన తన పాత చిత్రానికి సీక్వెల్ కు రెడీ అవుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అనిల్ రావిపూడి తదుపరి సినిమాగా ఎఫ్ 2 కి సీక్వెల్ ఉంటుందనేది తాజా సమాచారం… వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ ఈ సీక్వెల్ లోను ఉంటారట. ఇక ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు తీయనున్నారట ఫన్ .. ఫ్రస్టేషన్ అండ్ మోర్ ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది ప్రస్తుతం వెంకటేష్ బిజీగా ఉన్నారు ఈసినిమా అవ్వగానే అనిల్ తో కలిసి ఈ సినిమాని ప్లాన్ చేస్తారట దసరాకి ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది.