కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్

0
104

పలాస 1978 ఈ మధ్య ఈ సినిమా పేరు బాగా వినిపిస్తోంది, రక్షిత్ నక్షత్ర అనే కొత్త హీరో హీరోయిన్లతో దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించారట, ఇక ఈ సినిమా గురించి టాలీవుడ్ లో చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ సినిమాని ధ్యాన్ అట్లూరి నిర్మించారు అని తెలుస్తోంది. ఈనెల ఆరున ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ను- బన్నీ వాసును ఆహ్వానించి ఈ సినిమా ప్రివ్యూ షో ను చూపించారు దర్శకుడు, అయితే ఈ షో చూసిన తర్వాత అల్లు అరవింద్ కు ఈ సినిమా ఎంతో బాగా నచ్చింది, అంతేకాదు ఈ చిత్ర యూనిట్ ని ఆయన ప్రశంసించారు, యథార్థ సంఘటనల ఆధారంగా ఆయన ఈ సినిమాను ఎంతో సహజంగా చిత్రీకరించాడంటూ ప్రశంసించారు.

ఇక డైరెక్టర్ కరుణ కుమార్ కి సినిమా పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు, అంతేకాదు ఈ సినిమా నచ్చడంతో గీతా ఆర్ట్స్ 2లోఆయనతో సినిమాని ప్రకటించేశారు, ఇక అడ్వాన్స్ గా కరుణ కుమార్ కి తన చేతుల మీదుగా చెక్ ను అందించారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత గీతా ఆర్ట్స్ 2లో కరుణ కుమార్ సినిమా చేయనున్నారు అనేది క్లారిటీ వచ్చేసింది.