కొత్త దర్శకుడికి రవితేజ అవకాశం – టాలీవుడ్ టాక్

కొత్త దర్శకుడికి రవితేజ అవకాశం - టాలీవుడ్ టాక్

0
83

రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు, ఇక కథలు నచ్చిన వెంటనే దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు రవితేజ..

వరుసగా ఆయన మూడు నాలుగు సినిమాలకు తగ్గకుండా చూసుకుంటాడు. కొత్త దర్శకులకి అవకాశాం ఇచ్చే వారిలో ముందు నాగార్జున ఉంటే తర్వాత రవితేజ పేరు వినిపిస్తుంది… హిట్లు ఫ్లాప్ లతో సంబంధం ఉండదు. సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళతారు రవితేజ.

 

తాజాగా కూడా ఆయన ఒక కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ స్టోరీ కొత్తగా అనిపించడంతో ఈ సినిమా చేసేందుకు ఒకే చెప్పారు అని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది….విరాటపర్వం సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు.

 

ఇక ఇప్పుడు ఉన్న సినిమాలు ఫినిష్ చేసి కొత్త సినిమా పట్టాలెక్కిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి..

ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్న రవితేజ, త్రినాథరావు నక్కినతో మరో సినిమా చేస్తారు.. ఆ తర్వాత ఈ సినిమా ఉంటుంది అని తెలుస్తోంది.