కొత్తహీరోతో త్రివిక్ర‌మ్ చిత్రం రెమ్యున‌రేష‌న్ ఎంతంటే

కొత్తహీరోతో త్రివిక్ర‌మ్ చిత్రం రెమ్యున‌రేష‌న్ ఎంతంటే

0
85

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో సినిమా చేయ‌నున్నారు, ఈ సినిమా కోసం రైటింగ్ లో బిజీగా ఉన్నారు ఆయ‌న‌, ఇక ఈ చిత్రం కూడా భారీ బ‌డ్జెట్ తో రానుంది, ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ ఈ చిత్రం చేయ‌నున్నారు.

అయితే తాజాగా ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆయన ఒక కొత్త హీరోను పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్ర‌మ్ ఈ మ‌ధ్య ఇలాంటి ప్ర‌యోగాలు చేయలేదు. కాని తాజాగా చేయ‌నున్నార‌ట‌.

ఓ వ్యాపార‌వేత్త త‌న కుమారుడిని సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి తీసుకురావాలి అని, హీరో చేయాలి అని అనుకుంటున్నారు.. ఈ సినిమా దాదాపు 170 కోట్ల‌తో నిర్మితం అవుతుంద‌ట‌, అంతేకాదు ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ కు 35 కోట్ల రెమ్యున‌రేష‌న్ కూడా ఇవ్వ‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది.