సాయి పల్లవి ఫిదా సినిమాతో ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ …సినిమా స్టోరీ నచ్చితేనే ఆమె ఒకే చేస్తుంది ..తన పాత్ర బాగుంటేనే ఆమె చేస్తుంది.. లేదంటే ఎంత పెద్ద సినిమా అయినా ఆమె రిజక్ట్ చేస్తుంది. అలాగే ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది.
ఎంసీఏ- పడి పడి లేచే మనసు- కణం- మారి 2- ఎన్ జీ కె చిత్రాల్లో నటించి అందర్నీ మెప్పించింది. ఇలా డిఫరెంట్ పాత్రలు ఆమె చేస్తోంది…తాజాగా ఫిదా బ్యూటీ సాయి పల్లవికి ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చిందట… దీని కోసం ఈ బ్యూటీకి దాదాపు కోటిన్నర ఆఫర్ చేశారట చిత్ర యూనిట్.
కాని ఆమె ఈ ఆఫర్ వద్దు అని చెప్పిందట, అయితే ఇంకా రెమ్యునరేషన్ ఇస్తాం అని చెప్పినా ఆమె నో చెప్పిందట.ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య లవ్ స్టోరీ.. రానా విరాటపర్వం సినిమాల్లో నటిస్తోంది. మొత్తానికి ఈ టాక్ అయితే టాలీవుడ్ లో నడుస్తోంది.