క్రీడా నేపథ్యంలో ఎన్టీఆర్ తో ఆ దర్శకుడు సినిమా – టాలీవుడ్ టాక్

క్రీడా నేపథ్యంలో ఎన్టీఆర్ తో ఆ దర్శకుడు సినిమా - టాలీవుడ్ టాక్

0
75

సినిమా హిట్ అయింది అంటే ఆ చిత్ర దర్శకుడికి మంచి అవకాశాలు వస్తాయి.. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా తమతో సినిమా చేయాలి అని కోరుతారు.. మంచి కథలు వినిపించమంటారు.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్ధలు మా బ్యానర్ లో చిత్రాలు చేయమని నిర్మాతలు ఆ దర్శకుడికి అడ్వాన్సులు ఇస్తారు, అయితే ఇప్పుడు ఉప్పెన దర్శకుడికి మంచి అవకాశాలు వస్తున్నాయి, ఉప్పెన సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతనిని చాలా మంది హీరోలు కథలు చెప్పమంటున్నారు.

 

ఇక కొత్త దర్శకులతో సినిమా చేయాలి అని చూసే హీరోలు ఇప్పటికే ఆయనతో మాట్లాడుతున్నారట.. తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి….దర్శకుడు బుచ్చిబాబు త్వరలోనే భారీ చిత్రం అనౌన్స్ చేయనున్నారు అనే టాక్ వినిపించింది. ఈ సమయంలో మరో వార్త వస్తోంది.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారట ఆయన . ఎన్టీఆర్ ని స్పోర్ట్స్ మేన్ గా డిఫరెంట్ పాత్రలో దర్శకుడు చూపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు… ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడితో సినిమా ఉంటుంది అని వార్తలు వచ్చాయి.. మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందా అనేది చూడాలి.. దీనిపై చర్చలు ఇంకా జరుగుతున్నాయట.. ఈ వార్తలు అయితే టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.