ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత చిన్న హీరోతో క్రిష్ సినిమా..!!

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత చిన్న హీరోతో క్రిష్ సినిమా..!!

0
111

నాగశౌర్య కథానాయకుడిగా రాఘవేంద్రరావు ఒక సినిమాను నిర్మించనున్నట్టు ఇటీవల ఒక వార్త షికారు చేసింది. ఆ వార్త నిజమేనన్నది తాజా సమాచారం. నాగశౌర్య హీరోగా ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా రూపొందనుంది. ఈ ముగ్గురు కథానాయికల జోడీగా కనిపించేది నాగశౌర్యయేననే టాక్ వినిపిస్తోంది. కథా పరంగా మూడు ప్రేమకథలు నడుస్తూ ఉంటాయట.

కొత్తదనం కోసం ఈ మూడు ప్రేమకథలను రూపొందించడానికిగాను రాఘవేంద్రరావు ముగ్గురు దర్శకులను తీసుకోనున్నారట. ఆల్రెడీ క్రిష్ ను ఒప్పించడం జరిగిపోయిందనీ, మిగతా ఇద్దరు దర్శకులు ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని అంటున్నారు. గోపీమోహన్ .. బీవీఎస్ రవి ఈ సినిమాకి స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి