చాల రోజుల తర్వాత ఆ ఇద్దరు కలిసి ఒకేసారి..!!

చాల రోజుల తర్వాత ఆ ఇద్దరు కలిసి ఒకేసారి..!!

0
98

లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేక ఖాళీగా ఉన్నాడు. రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే చిత్రం తర్వాత నక్షత్రం సినిమా అయన డైరెక్ట్ చేసిన లాస్ట్ చిత్రం.. ఈ చిత్రానికి అంత మంచి పేరు రాకపోవడంతో అయన కు అవకాశాలు సన్నగిల్లాయి..

అయితే ప్రస్తుతం ఒక విభిన్నమైన కథతో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాడట. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించబోతుందట. గతంలో కృష్ణవంశి దర్శకత్వంలో నితిన్, అర్జున్, ఛార్మీ నటించిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో నటించింది రమ్యకృష్ణ. దాదాపు 15 ఏళ్ల తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ నటిస్తుంది.