అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు నటించిన ‘కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)’ చిత్రం గురువారం విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఐతే సినిపలో కురు క్షేత్ర యుద్ధం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో శ్రీకృష్ణుని పాత్ర పోషించిన నటుడి ముఖాన్ని చూపించలేదు. దీంతో అతనెవరా అనే చర్చ మొదలైంది. అతని కోసం గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు.
కృష్ణుడి పాత్ర పోషించిన నటుడి నడక తీరు చూసి హీరో నాని అన్నారు కొందరు. కాదు కాదు అర్జున్ దాస్ అన్నారు మరికొం దరు. ఈ చర్చకు తెర దించుతూ ఆ సినిమాలో కృష్ణుడి రోల్ లో యాక్ట్ చేసింది నేనే అంటూ సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు తమిళ నటుడు కృష్ణకుమార్ బాలసుబ్రహ్మణ్యన్(Krishnakumar Balasubramanian). ‘ఒక అద్భుత చిత్రంలో అటువంటి ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం రావడం నిజంగా అదృష్టం’ అని ఆయన ఇంస్టాగ్రమ్ లో స్టోరీ పెట్టారు. కృష్ణకుమార్ కొత్త నటుడేమీ కాదు, 2010లోనే ఆయన చిత్ర రంగ ప్రవేశం చేశారు. ‘కదలగై’ తమిళ చిత్రంలో నటించిన ఆయన ఆ తర్వాత రంగస్థల ప్రవేశం చేసి పలు నాటకాల్లో నటించారు. పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. సూర్య నటించిన అనువాద చిత్రం ‘ఆకాశం నీ హద్దు’లో కీలక పాత్ర పోషించారు. ధనుష్ ‘మారన్’ సినిమాలో అత నికి ఫ్రెండ్గా నటించారు. ‘కల్కి(Kalki 2898 AD)’ కృష్ణకుమార్కు ఐదో చిత్రం కావడం విశేషం.