కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం..భారీగా తరలివచ్చిన అభిమానులు

0
74

హీరో, విలక్షణ నటుడు, ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నిన్న తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతితో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ఆయన అంత్యక్రియలు నేడు మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ లో జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు చేయనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభం అయింది. కృష్ణంరాజు కడసారి చూపుకోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో ఇండస్ట్రీ మూగబోయింది. విలన్ గా, హీరోగా, సైడ్ హీరోగా, సపోర్టింగ్ రోల్ ఇలా అన్ని పాత్రల్లో నటించి మెప్పించారు కృష్ణంరాజు.  ఇక ప్రభాస్ చేసిన బిల్లా, రెబల్ లోనూ కృష్ణంరాజు నటనతో అదరగొట్టారు. ఇక కృష్ణంరాజు నటించిన చివరి చిత్రం ప్రభాస్ దే కావడం విశేషం. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ మూవీనే కృష్ణంరాజుకు చివరి సినిమా.