అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు

0
97

రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కాగా కడసారిగా కృష్ణంరాజుకు కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. కృష్ణం రాజు పార్థివదేహానికి హీరో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ తలకొరివి పెట్టారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు నిన్న తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే..