టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముని కొడుకే హీరో ప్రభాస్. ప్రభాస్ కు పెదనాన్న అంటే ప్రాణం. అందుకే వీలైనంత సమయం ఆయన కోసం కేటాయించేవాడట ప్రభాస్. ఇక కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న హీరో ప్రభాస్ హుటాహుటీన ఆసుపత్రికి వచ్చారు. ఆయన మృతిదేహాన్ని చూసిన ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు.
ఇక కృష్ణం రాజు చివరి కోరిక గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. హీరో ప్రభాస్ పెళ్లి చూడాలని అలాగే తన పిల్లలతో ఆడుకోవాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ ఇంతలోనే ఆయన మరణించడంతో ఆయన ఆత్మ ఘోషిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా కృష్ణంరాజు అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున కన్నమూశారు.
కాగా ప్రభాస్ తో బిల్లా, రెబల్, రాధేశ్యామ్ వంటి సినిమాల్లో నటించారు. ప్రభాస్ సినిమాల్లోకిరావడానికి కృష్ణంరాజే కారణం. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ సినిమాతో ఆరంగేట్రం చేయగా ప్రభాస్ కెరీర్ పై పెదనాన్న ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.