ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ , కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్యం పాలయ్యారు, ఆయనని వెంటనే కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ లో ఉన్న కేర్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.
నిన్న రాత్రి ఊపిరి తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు కృష్ణంరాజు, వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు అని తెలుస్తోంది.
ఇక సినిమాలకు రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు కృష్ణంరాజు. కొద్దికాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నారు, ఇక చలి తీవ్రత హైదరాబాద్ లో పెరగడంతో చల్లగా వాతావరణం అవడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది అని తెలుస్తోంది.
డాక్టర్లు కృష్ణంరాజును ఐసీయూలో ఉంచారు. పరిస్థితి మెరుగుపడితే ఈరోజే జనరల్ వార్డ్ కు డిశ్చార్జ్ చేస్తారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, సజావుగానే ఊపిరి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు డాక్టర్లు తెలియచేశారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని పెద్ద ఎత్తున టాలీవుడ్ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకుంటున్నారు.. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు.