‘వీరమల్లు’పై దర్శకుడు క్రిష్ అప్ డేట్ ఇదే..

0
121

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ ‘హరి హర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే ఈ మధ్య పవన్ ‘భీమ్లా నాయక్’ షూటింగులోనే తప్ప, ‘వీరమల్లు’ సెట్స్ పై కనిపించలేదు. ఆ సినిమా ఎంతవరకూ వచ్చిందనేది ఎవరికీ తెలియదు. ‘కొండ పొలం’ సినిమా ప్రమోషన్ లో ఈ విషయంపై క్రిష్ అప్ డేట్ ఇచ్చారు.

మార్చి వరకు అప్పటికి 25 శాతం చిత్రీకరణను పూర్తి చేశాము. తదుపరి షెడ్యూల్ ను వచ్చేనెల 2వ వారంలో మొదలు పెట్టాలనుకుంటున్నాము. ఆ షెడ్యూల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ షూటింగు చేసేస్తాము” అని క్రిష్ చెప్పుకొచ్చారు. కాగా పవన్ భీమ్లా నాయక్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

మరోపక్క హరీష్‌శంకర్‌, సురేందర్‌ రెడ్డి సిద్ధం చేసిన కథలూ ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కొత్తతరం దర్శకులు ఇంకో ఇద్దరు పవన్‌ కల్యాణ్‌ కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.