ఫోన్లు ఎవరితో అయినా మాట్లాడితే ఆ మాటలు సంభాషణలు బయటకు వస్తే పరిస్దితి ఎలా ఉంటుందో తెలిసిందే, ప్రైవసీ అనేది ఉండాల్సిందే, ఇక సెలబ్రెటీల విషయంలో ఇవి మరింత పక్కాగా ఉండాలి, తాజాగా నటి ఖుష్బూకు ఇలాంటి పరిస్దితి ఎదురైంది.
పాత్రికేయుల గురించి తాను మాట్లాడిన ఓ ఆడియో టేప్ బయటకు లీక్ కావడంతో ఖుష్బూ ట్విటర్ వేదికగా స్పందించారు.
త్వరలో బుల్లితెర, వెండితెర షూటింగ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలివిజన్ ప్రొడ్యూసర్స్ వాట్సాప్ గ్రూప్లో ఖుష్బూ ఇటీవల ఓ ఆడియో పెట్టారు. ప్రస్తుతం మీడియా వాళ్లకి కరోనా గురించి కాకుండా రాయడానికి ఏం లేదు. షూటింగ్స్ ప్రారంభం కాగానే వాళ్ల దృష్టి మనపైన పడుతుంది. అందుకే ఫోటోలు వీడియోలకు అనుమతి ఇవ్వకండి అని ఆమె అన్నారు
దీంతో అది బయటకు లీక్ అయింది. ఈ విషయం తెలిసిన ఖుష్బూ వెంటనే వివరణ ఇచ్చుకున్నారు. ప్రెస్ వాళ్ల గురించి నేను మాట్లాడిన ఓ ఆడియో నిర్మాతల గ్రూప్ నుంచి బయటకు లీక్ అయ్యింది. మన మధ్య ఇలాంటి మనుషులు ఉన్నారని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ప్రెస్ను అమర్యాదపరచాలనేది నా ఉద్దేశం కాదు అని ఖుష్బూ తెలిపారు. నామాటలతో ఎవరికి అయినా ఇబ్బంది వచ్చి ఉంటే క్షమించండి అని తెలిపారు. ఈ ఆడియో ఏ నిర్మాత బయటపెట్టారో తనకు తెలుసు అని ఆమె ఘాటుగా చెప్పారు.