నేను కథ చెప్పగానే సాయిచంద్ ఏడ్చేశారు: ‘దొరసాని’ దర్శకుడు కేవీఆర్ మహేంద్ర

నేను కథ చెప్పగానే సాయిచంద్ ఏడ్చేశారు: 'దొరసాని' దర్శకుడు కేవీఆర్ మహేంద్ర

0
88

ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో ‘దొరసాని’ మంచి మార్కులు కొట్టేసింది. దర్శకుడిగా ఈ సినిమా కేవీఆర్ మహేంద్రకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

‘దొరసాని’ సినిమాలో నక్సలైట్ నాయకుడి పాత్రను కన్నడ కిషోర్ చేశారు. తెలంగాణ యాసలో మాట్లాడవలసిన ఈ పాత్రకి ముందుగా సాయిచంద్ ను అనుకున్నాము. నేను కథ చెప్పగానే సాయిచంద్ ఏడ్చేశారు. ఈ పాత్రను చేయడానికి ఆయన ఎంతో ఆసక్తిని చూపించారు. కానీ ఆ సమయంలో ఆయన ‘సైరా’ సినిమా షూటింగుతో బిజీగా వున్నారు. ఎంతగా ప్రత్నించినా డేట్స్ కుదరలేదు. అందువలన కన్నడ కిషోర్ ను తీసుకోవలసి వచ్చింది. తెలంగాణ యాసతో డైలాగ్స్ చెప్పడానికి తను చాలా కసరత్తు చేశారు” అని చెప్పుకొచ్చాడు.