Laapataa Ladies | ఆస్కార్ రేస్ నుంచి ‘లా పతా లేడీస్‌’ ఔట్

-

ఆస్కార్ రేస్‌లో చోటు దక్కించుకుని అందరి ఆశలను ఆకాశానికెత్తేసిన సినిమా ‘లా పతా లెడీస్(Laapataa Ladies)’. ఈ సినిమాకు ఆస్కార్ పక్కా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ మూవీకి నిరాశే ఎదురైంది. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ‘లా పతా లేడీస్’ 2025 ఆస్కార్ రేసులో నిలిచింది. కాగా తమ జాబితాలోకి వచ్చిన సినిమాలను డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చేసింది. అనంతరం తాజాగా ఈ నూతన జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ‘లా పతా లేడీస్’ లేక పోవడంతో సినీ ప్రియులు నిరాశకు గురయ్యారు.

- Advertisement -

‘లా పతా లేడీస్(Laapataa Ladies)’ టీమ్ ఆస్కార్ కోసం ఎంతో శ్రమించింది. ఆస్కార్ క్యాంపెయిన్‌లో భాగంగా వరుస స్క్రీనింగ్‌ను ప్రదర్శించింది. హాలీవుడ్ మీడియాకు కిరణ్ రావు, ఆమిర్ ఖాన్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. మహిళల స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం, భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గురించి మాట్లాడే శక్తి ఈ కథకు ఉంది. ఇది చాలా గొప్ప సందేశాత్మక చిత్రం కాబ్టి ఆస్కార్ వస్తుందని ఇండియన్స్ అందరూ అనుకున్నారు. కానీ చివరకు ఈ సినిమా ఆస్కార్ రేస్ నుంచి తప్పుకోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది.

Read Also: నాకు అలాంటి పార్ట్నర్ కావాలి: రష్మిక
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Robin Hood | వెనకడుగు వేసిన ‘రాబిన్ హుడ్’

యంగ్ హీరో నితిన్(Nithin), వెంకీ కుడుముల(Venky Kudumula) కాంబోలో వస్తున్న సినిమా...

Rashmika | నాకు అలాంటి పార్ట్నర్ కావాలి: రష్మిక

సినీ సెలబ్రిటీల ప్రేమ, పెళ్ళి, రిలేషన్ వంటి విషయాలు అభిమానులకు అత్యంత...