Rajasaab | ‘రాజాసాబ్’ కోసం స్పెషల్ సాంగ్ రెడీ..

-

ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘రాజాసాబ్(Rajasaab)’. ప్రభాస్ తన కెరీర్‌లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ మూవీ కూడా ఇదే. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కీ అప్‌డేట్ ఇచ్చాడు. ‘రాజాసాబ్’ సినిమా కోసం ఓ పాపులర్ పాటను రీమిక్స్ చేయనున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ పాట ఏంటనేది ఇంకా అధికారికంగా తేలకపోవడంతో.. ఆ పాట ఏంటంటూ సోషల్ మీడియాలో భారీ చర్చే జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఎంత ఖర్చయినా అనుకున్న విధంగానే రాజాసాబ్‌ను తెరకెక్కించనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పరకటించారు.

- Advertisement -

ఈ మూవీ కోసం బాలీవుడ్‌ను షేక్ చేసిన సినిమా నుంచి ఓ పాటను సెలక్ట్ చేసుకున్నామని థమన్ చెప్పాడు. ఇప్పటికే ఆ పాట రీమిక్స్ కూడా స్టార్టయినట్లు సమాచారం. అది సంజయ్ దత్(Sanjay Dutt) హీరోగా 1994లో తెరకెక్కిన ‘ఇన్సాఫ్ అప్నే లాహూ సే’ అనే మూవీ నుంచి ‘హవా హవా’ అనే సాంగ్‌ను ఓకే చేసుకుందట మూవీ టీమ్. ఈ పాటను రీమిక్స్‌తో పాటు రీమేక్ కూడా చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయని, ఇందులో ప్రభాస్ కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ‘రాజాసాబ్(Rajasaab)’లో కూడా సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అందుకే ఈ పాట రీమిక్స్ రైట్స్ సులభంగా లభించాయని కూడా టాక్ నడుస్తోంది. మరి చూడాలి ఈ పాటను ఏ రేంజ్‌లో రీమిక్స్ చేస్తారో.

Read Also: ఎదురు చూపులకు చెక్.. కాంతార ప్రీక్వెల్ వచ్చేదప్పుడే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...