లారెన్స్ భారీ విరాళం సౌత్ ఇండియాలో టాప్

లారెన్స్ భారీ విరాళం సౌత్ ఇండియాలో టాప్

0
89

లారెన్స్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న డ్యాన్స్ మాస్ట‌ర్, ఇండియాలో ఆయ‌న డ్యాన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు, ఇక కాంచ‌న చిత్రం గంగ ఆయ‌న కెరియ‌ర్లో చాలా పేరు తెచ్చిపెట్టాయి.

క‌రోనా వైర‌స్ పై పోరుకి ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ సాయం అందించారు. తాను చేయబోయే సినిమాకు సంబంధించి అడ్వాన్స్ అందగానే మూడు కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు లారెన్స్.

ఆయ‌న వ‌చ్చే రోజుల్లో రజనీకాంత్ సినిమా చంద్రముఖి-2 లో నటించబోతున్నారు, ఇందులో లారెన్స్ కు అడ్వాన్స్ ఇవ్వ‌నుంది నిర్మాణ సంస్ధ‌, అయితే అందులో నుంచి మూడు కోట్లు క‌రోనా ఫైట్ కు ఇవ్వ‌నున్నారు లారెన్స్.

రూ. 50 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు
రూ. 50 లక్షలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు
రూ. 50 లక్షలు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు
డ్యాన్సర్స్ యూనియన్‌కు రూ. 50 లక్షలు
దివ్యాంగులకు రూ. 25 లక్షలు ఇస్తాను అన్నారు.
లారెన్స్ పుట్టిన ఊరు రోయపురం-దేశీయనగర్‌లోని కార్మికులకు రూ. 75 లక్షలు ఇస్తాను అని తెలిపారు..
నిజంగా ఆయ‌న సాయం పై అంద‌రూ మెచ్చుకుంటున్నారు.