Somy Ali | ‘సల్మాన్ ఖాన్ కన్నా లారెన్స్ బిష్ణోయ్ చాలా నయం’: సోమీ అలీ

-

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై అతడి మాజీ ప్రియురాలు సోమీ అలీ(Somy Ali) షాకింగ్ కామెంట్స్ చేశారు. సల్మాన్ ఖాన్ కన్నా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) చాలా బెటర్‌ అంటు తీవ్రంగా వ్యాఖ్యానించారు. సల్మాన్‌తో గడిపిన ఎనిమిదేళ్లలో నరకం చూశానని, అతను ఇతర ప్రేయసుల కంటే తనతో అత్యంత దారుణంగా ప్రవర్తించాడంటూ విమర్శించింది. గతంలో ఒకసారి ఐశ్వర్యారాయ్‌తో కూడా సల్మాన్ అసభ్యకరంగా ప్రవర్తించాడని, సల్మాన్ వల్లే ఐశ్వర్యారాయ్ భుజానికి గాయమైందని కూడా సోమీ వెల్లడించింది. కత్రినా కైఫ్‌తో ఎలా ప్రవర్తించాడో తనకు తెలియదని, కానీ తన విషయంలో మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ప్రవర్తించేవాడని వివరించింది.

- Advertisement -

ఒకానొక సమయంలో సల్మాన్(Salman Khan) తనను కొడుతుంటే పని మనిషి తనను గదిలో పెట్టి తలుపు వేసి సల్మాన్ నుంచి కాపాడిందని కూడా సోమీ చెప్పింది. తన పరిస్థితిని చూసి గతంలో నటి టబు కూడా చాలా బాధపడిన విషయాన్ని సోమీ అలీ గుర్తు చేసుకుంది. ‘‘నన్ను చూసి టబు ఏడ్చింది. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా సల్మాన్ ఖాన్ రాలేదు. సల్మాన్‌తో నేను పడిన కష్టాల గురించి నా తల్లికి కొందరు సన్నిహితులకు మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఒక పుస్తకం రాస్తున్నా. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తా’’ అని సోమీ(Somy Ali) వెల్లడించింది.

Read Also: కూతురు పేరు ప్రకటించిన దీపిక పదుకొణె..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...