లారెన్స్ తమ్ముడు నీచపు పని అమ్మాయికి వేధింపులు

లారెన్స్ తమ్ముడు నీచపు పని అమ్మాయికి వేధింపులు

0
135

ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ అందరికి సుపరిచితమే.. అంతేకాదు గొప్ప దైవ భక్తుడిగా చెబుతారు.. అంతేనా సమాజ సేవ ఉచిత విద్య పిల్లలని చదివించడం ఉచిత ఆపరేషన్లు డొనేషన్లు ఇలా మంచి కార్యక్రమాలు చాలా చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఉంటాడు..

అయితే ఆయన తమ్ముడు వినోద్ ఎల్విన్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు, అన్న మంచి పేరు తెచ్చుకుంటే తమ్ముడు చెడ్డ పేరు తెచ్చాడు. వినోద్ తనను గత కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ వరంగల్ జిల్లాకు చెందిన దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించింది. తను నన్ను ప్రేమించాను అన్నాడు కాని నేను రిజక్ట్ చేశాను అప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు అని ఆమె తెలిపింది.

అతని ప్రేమను తాను తిరస్కరించడంతో వేధించడం మొదలు పెట్టాడని చెప్పింది. దీంతో అతనిపై పోలీసు కేసు నమోదు చేసింది… కాని పోలీసులతో కుమ్మక్కై తనపై కేసు నమోదు చేశారు.. నన్ను జైలుకి పంపించారు అని మీడియాకి తెలిపింది. తనని కాపాడాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆమె కోరుతోంది.