‘లైగర్’ ఎఫెక్ట్..జనగణమన సినిమాపై విజయ్ సంచలన కామెంట్స్

0
131

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘లైగర్’. ఈ సినిమాను పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. విజయ్ సరసన అనన్య రొమాన్స్ చేసింది. విజయ్ కు తల్లిగా రామకృష్ణ, కీలక పాత్రలో మైక్ టైసన్ నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది.

ఇండియా షేక్ అయితది అనుకున్న విజయ్ దేవరకొండకు అభిమానులు షాకిచ్చారు. ‘లైగర్’ షూటింగ్ సమయంలోనే తన తదుపరి సినిమాలను బయటపెట్టాడు విజయ్. పూరి కళల ప్రాజెక్ట్ ‘జనగణమన’ విజయ్ తో తీయబోతున్నట్టు తెలిపారు. కానీ లైగర్ ఇచ్చిన ఇంపాక్ట్ తో జనగణమనపై ఆ ఎఫెక్ట్ పడింది.

ఇక తాజాగా సైమా వేడుకలో పాల్గొన్న విజయ్ ను జనగణమన సినిమా గురించి అడగగా..ఇలా అన్నారు. “ఇక్కడ అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జనగనమనను మర్చిపోండి. సైమాను ఎంజాయ్ చేయండి.” ఈ వ్యాఖ్యలతో జనగణమన సినిమా ఆగిపోయిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏదేమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..