పాన్ ఇండియా మూవీ ‘లైగర్(Liger)’ చిత్రంతో తాము తీవ్రంగా నష్టపోయామని నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు నిరసనకు దిగారు. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోట్ల రూపాయల్లో నష్టపోయిన తమను ఆదుకుంటామని దర్శకుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh), డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చారని తెలిపారు. కానీ ఆరునెలలు అయినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని వాపోయారు. తమకు న్యాయం చేసే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టంచేశారు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్(Liger)’ గతేడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సినిమా కొన్న ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు.