లైగర్ పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న రౌడీ హీరో..సోషల్ మీడియాలో వీడియో హల్ చల్

0
97

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.  ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లైగర్ టీమ్ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. తాజాగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లైగర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. లైగర్ సినిమా బ్లాక్ బస్టర్ అని అన్నారు విజయ్. తనకు సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోతుందని. గతంలో అర్జున్ రెడ్డి టైం లో కూడా ఇలానే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పా అది జరిగింది. ఇప్పుడు లైగర్ బ్లాక్ బస్టర్ అని డిక్లేర్ చేస్తున్నా అని విజయ్ అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

https://twitter.com/theaishusai?