బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోన్న షో ‘బిగ్‌బాస్’. ఈ షోకు వ్యాఖ్యాతగా హీరో నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనే ఎదురుచూపులకి తెరదించుతూ తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది.ఈ ప్రోమోలో..ప్రియాంకని ఉద్దేశించి శ్రీరామచంద్ర ‘వాలు కనులదాన’ పాటని ఆలపించి ఆకట్టుకున్నాడు.
తర్వాత లోబో, ప్రియాంక మధ్య ‘ఖుషి’ సినిమాలోని నడుమ సీన్ రిపీట్ చేశారు. బుద్ధిగా చదువుకుంటున్నట్టు కనిపిస్తూనే ప్రియాంక వైపు లోబో ఓరగా చూస్తాడు. అంతే ‘లోబో..నీ చూపు సరిగా లేదు’ అంటూ భూమికలా కస్సుమంది ప్రియాంక.
ఇలా సరదాగా సాగే ఎపిసోడ్‌లో ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది. ఈ వారం బెస్ట్, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో? నిర్ణయించే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడం ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి ఎవరు బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలిచారో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి.