Leo 2 |‘లియో 2’ గురించి లోకేష్ కనగరాజ్ ఏమన్నాడో తెలుసా..!

-

విజయ్ ఇళయదళపతి(Vijay Thalapathy) హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘లియో’. గతేడాది విడుదలైన ఈ మూవీ మంచి టాక్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందని, అదెప్పుడు తీస్తారో, అసలు తీస్తారో లేదో అని అభిమానుల్లో సందేహాలు అధికమవుతూనే ఉన్నాయి. అనేక సందర్భాల్లో లోకేష్ కూడా ‘లియో 2(Leo 2)’ గురించి మాట్లాడాడు. ఏడాదిగా చర్చల్లో నిలుస్తున్న ఈ ప్రశ్నలపై దర్శకుడు లోకేష్(Lokesh Kanagaraj) తాజాగా స్పందించాడు. ‘బ్లడీ బెగ్గర్’ సినిమాను వీక్షించిన లోకేష్.. విలేకర్లతో చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగానే ‘లియో 2’ వస్తుందా.. రాదా.. లియోకు సీక్వెల్ పరిస్థితి ఏంటి అని ఒకరు ప్రశ్నించగా.. లోకేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

- Advertisement -

‘‘విజయ్ అన్న ఒప్పుకోవాలే కానీ ‘లియో 2’ తప్పకుండా తీస్తా. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో కూడా విజయ్ అన్న మంచి ఫలితాలు అందుకోవాలని సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా’’ అని స్పష్టం చేశాడు. తన మాటలతో లియో 2కు విజయ్ అంగీకరం రావడమే ఆలస్యమని చెప్పాడు. కాగా ప్రస్తుతం రాజకీయ రంగప్రవేశం చేసి ఫుల్ బిజీగా ఉన్న విజయ్.. 2026 తమిళనాడు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ‘లియో 2(Leo 2)’ అంటే 2026 తర్వాతే అని కూడా టాక్ నడుస్తోంది. మరి ‘లియో 2’ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Read Also: రిషబ్ పంత్‌ని ఢిల్లీ అందుకే వదిలేసిందా..?
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paidi Rakesh Reddy | కొడకా.. అంటూ కోమటిరెడ్డిపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Paidi...

Golden Temple | గోల్డెన్ టెంపుల్‌లో గన్ షాట్స్.. మాజీ సీఎం టార్గెట్..

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌(Golden Temple)లో కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్ మాజీ...