లవ్ లో శ్రీముఖి ఇంతకీ అబ్బాయి ఎవరు

లవ్ లో శ్రీముఖి ఇంతకీ అబ్బాయి ఎవరు

0
119

బుల్లితెరలో తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్నారు.. అయితే ఎక్కువగా శ్రీముఖికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఇక బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ అవుతుంది అని అందరూ అనుకున్నారు.. కాని ఆమె చివరి వరకూ వెళ్లి రన్నర్ గా నిలిచారు..
శ్రీముఖి తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. వాళ్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

అయితే ఇక్కడ ఓ కామెంట్ మాత్రం కాస్త ఆలోచనలో పెట్టింది అభిమానులని.. మీరు ప్రేమలో ఉన్నారా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి స్పందిస్తూ.. అవును అని సమాధానం ఇచ్చింది. దీంతో ఆ అబ్బాయి ఎవరు, ఆ లక్కీ పర్సెన్ ఎవరూ అని ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు.

అయితే ఆమె మాత్రం అతను ఎవరు అనేది చెప్పలేదు, ఇక మీకు ముద్దు పెడతాను అంటే తిరస్కరించారా అని అడిగితే అవును అని చెప్పింది శ్రీముఖి…అలాగే స్నేహితుడి నుంచి తప్పించుకునేందుకు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పానని అంది, ఇక పరీక్షల్లో కూడా కొన్ని సార్లు మోసం చేశాను అని తెలిపింది, ఇక పక్కవారి సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూడటం చాలా చెడ్డ అలవాటు అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.