లవ్ సీక్రెట్ చెప్పిన ప్రియమణి

లవ్ సీక్రెట్ చెప్పిన ప్రియమణి

0
116

తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది హీరోయిన్ ప్రియమణి తాజాగా ఈ ముద్దుగుమ్మ గతంలోజరిగిన సంఘటనలను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది… హీరో తరుణ్ తో కలిసి ప్రియమణి నవ వసంతం చిత్రం చేసింది…

ఈ చిత్ర షూటింగ్ సమయంలో తరుణ్, ప్రియమణి మధ్య స్నేహం ఏర్పడింది… దీంతో తామిద్దరం లంచ్ డిన్నర్లకు వెళ్లేవాళ్లమని తరుణ్ ఎంతో సరదాగా ఉండేవాడని చెప్పంది… దీంతో అందరు ప్రేమ అనుకున్నారని చెప్పింది…

అది తెలుసుకున్న తరుణ్ తల్లి రోజా రమణి కూడా వచ్చారని ఆమె తన వద్దకు వచ్చి మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది ఇష్టమైతే తరుణ్ ను పెళ్లి చేసుకోవచ్చుగా అని చెప్పింది… దీంతో తాను షాక్ కు గురి అయ్యానని చెప్పింది… తాము మంచి స్నేహితులమని చెప్పింది… అంతేకానీ ఇంకేమి లేదని చెప్పింది