ఓటీటీలో లవ్ స్టోరీ స్ట్రీమింగ్..రిలీజ్ ఆరోజే

Love story streaming on OTT..release day

0
92

యూత్​లో క్రేజ్ సంపాదించి, థియేటర్లలో అలరిస్తున్న ‘లవ్​స్టోరి’ ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. అక్టోబరు 22 సాయంత్రం 6 గంటల నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించడం సహా కొత్త ట్రైలర్​ను విడుదల చేశారు.

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. జుంబా ట్రైనర్​గా చైతూ కనిపించగా, భయస్థురాలైన అమ్మాయిగా డిఫరెంట్​ రోల్​లో సాయిపల్లవి నటించింది. సున్నితమైన కథలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పవన్​ సంగీతమందించిన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉన్నాయి.