పోకిరి సినిమాలో ముందు హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారో తెలుసా

పోకిరి సినిమాలో ముందు హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారో తెలుసా

0
94

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పోకిరి.. ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే.. ఇక ఎన్నో రికార్డులు నెలకొల్పింది ఈ చిత్రం…అంతేకాదు టాలీవుడ్ లో టాప్ 10 చిత్రాల్లో నిలిచింది ..దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్స్ కి నటీనటులకి ఎంతో పేరు తీసుకువచ్చింది.

 

2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఐతే ఈ చిత్రంలో ముందుగా అనుకున్న కథానాయిక ఇలియానా కాదట. అయితే ఈ సినిమాకి ఇలియానా ఎంత హైలెట్ అయిందో తెలిసిందే….కాని ముందు ఇలియానా కాకుండా మరో నటిని అనుకున్నారట.

 

సూపర్లో నటించిన అయేషా టకియాను అనుకున్నారు. కాని ఆ తర్వాత ఇలియానాని తీసుకున్నారు. అయితే ముందుగా పూరీ మాత్రం ఈ సినిమాను రవితేజ, కంగనా హీరో,హీరోయిన్లుగా చేద్దాము అని అనుకున్నారు, ఈ సినిమాకి కూడా ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ అనుకున్నారు కాని ఆ తర్వాత కథ మహేష్ కు వెళ్లింది. ఈ సినిమా ఇలా సూపర్ హిట్ అయింది.