Lucifer 2 | ముగిసిన ‘లూసిఫర్ 2’ షూటింగ్.. రిలీజ్ అప్పుడే

-

మోహన్‌లాల్(Mohanlal), పృథ్విరాజ్ సుకుమారన్(Prudhvi Raj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘లూసిఫర్’. 2019లో విడుదలై ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు డిమాండ్ చేశారు. అదే విధంగా ‘లూసిఫర్’కు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని చెప్పి మేకర్స్.. ఈ రెండో భాగాన్ని పట్టాలు కూడా ఎక్కించి శరవేగంగా షూటింగ్‌ను నడిపించారు. తాజాగా ‘లూసిఫర్2(Lucifer 2): ఎంపురాన్(రాజు కన్నా గొప్పవాడు)’ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని మోహన్ లాల్ స్వయంగా వెల్లడించాడు. 14 నెలలు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశామని మోహన్ లాల్ పేర్కొన్నాడు.

- Advertisement -

‘‘సినిమా షూటింగ్ పూర్తయింది. 14 నెలల సమయం. ఎనిమిది రాష్ట్రాలు, యూఎస్, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాల్లో అద్భుతమైన ప్రయాణం. ప్రతి ఫ్రేమ్2ను ఎలివేట్ చేసే టాలెంట్ పృథ్వీరాజ్ సొంతం. ఈ కథకు తనదైన స్క్రీన్‌ ప్లేతో ప్రాణం పోశాడు మురళీగోపీ. మాపై నమ్మకం ఉంచి ఎంతో సపోర్ట్ చేసిన నిర్మాలను కృతజ్ఞతలు. అందరి సహకారంతోనే ఈ ప్రాజెక్ట్‌ను సాధించగలిగాం. మాపై అభిమానులు చూపే ప్రమే మా స్ఫూర్తిని పెంచింది’’ అని మోహన్‌లాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అయితే ఈ సినిమా(Lucifer 2) వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Read Also:  ‘అప్పుడు ఆత్మహత్యే దారనిపించింది’.. కెరీర్‌పై రాజేంద్రప్రసాద్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...